దశదిశలా వ్యాపించి ఉన్న తెలుగువారిని ఒక్క వేదిక మీదకు చేర్చి తెలుగు కీర్తిని , ఖ్యాతిని, స్ఫూర్తిని , వాడిని, రుచిని ప్రపంచానికి చాటాలన్నదే రాంకీ ఫౌండేషన్ ఆద్వర్యంలో గ్లోబల్ విమెన్ నెట్వర్క్ సహ సమర్పణలో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహోత్సవ ముఖ్యోద్దేశం. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, తెలుగువారు తెలుగులో నడవటం, పరుగెత్తటం, నవ్వటం అమ్మతనానికి ప్రతిరూపం.
ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆవేశం, ఆవేదన, ఆందోళన మాతృభాషలో ప్రకటించటం స్వచ్చత, స్వేచత, గాఢత ప్రస్ప్ఫుటిస్తుంది. తెలుగెంత వెలుగో తెలుస్తుంది.
వాసులతో పాటు ప్రవాసాంధ్రులు తెలుగు ఘనచరిత్రను సంస్కృతిని నెమరేసుకుని, వల్లెవేసుకుని, వడపోసుకుని, ముచ్చటించుకుని భవిష్యత్తులో శోధించి సాధించాల్సిన వాటికోసం భాషను నవరత్న ఖచిత పల్లకిలో ఊరేగించి పట్టం గట్టాల్సిన ప్రణాలికను రూపొందించి కర్తవ్యాన్ని నిర్వర్తించటం కోసం మీరంతా కదలిరండి. కలసిరండి.
|